కలెక్టరేట్ ఆవరణలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల సహాయ ఉపకరణాల ఎంపిక కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఆర్టిఫిషియల్ లింబ్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తగూడెం, పాల్వంచ పరిసర ప్రాంతాలకు చెందిన 178 మంది దివ్యాంగులు హాజరయ్యారు. అశ్వారావుపేట, భద్రాచలం, గుండాలలోనూ శిబిరాలు జరగగా మరో 269 మంది హాజరయ్యారని ఆలింకో ఇన్ఛార్జి రంజనెశెట్టి తెలిపారు.