రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని డివైడర్స్ మధ్య ప్రాణాంతక వాయువులను విడుదల చేసే కోనోకార్పస్ చెట్లు ఏపుగా పెరిగాయి. విష వాయువుల ఇచ్చే చెట్లను వెంటనే తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఐ నేత కడారి రాములు అధికారులకు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. పిచ్చి మొక్కలు తొలగించి ప్రాణవాయువును ఇచ్చే మొక్కలను పెంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.