వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో అదనంగా ఆన్న కోడెలు, ఆవులను గతములో ధరఖాస్తులు ఇచ్చియున్న అర్హులైన హిందూ రైతులకు రెండవ విడతగా పంపిణీ చేయనున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ద్వారా ఉచితముగా పంపిణీ కార్యక్రమము ఉంటుదని ఈవో వినోద్ రెడ్డి తెలిపారు.