రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలోని యంగ్ స్టార్స్ యూత్ కి మ్యాకల మల్లికార్జున్ (కానిస్టేబుల్) వాలీబాల్, క్రికెట్ బ్యాట్, క్యారం అందించారు. యూత్ మద్యానికి బానిస కాకుండా అందరు ఆటలు ఆడుకుంటూ ఆరోగ్యంగా వుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేరల్ల ధర్మేందర్, బైరగోని నందయ్య, ఎక్కలదేవి శ్రీనివాస్, మ్యాకల ప్రసాద్, కోనరావుపేట కానిస్టేబుళ్లు మాల్యాల రావి, జగన్ యంగ్‌స్టార్స్ యూత్ సభ్యులు ఉన్నారు.