రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివరాలను ఎస్పి అఖిల్ మహాజన్ అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని అన్నారు. వారి వెంట సిఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.