వేములవాడలో స్కందమాత అలంకారంలో అమ్మవారు (వీడియో)

76பார்த்தது
దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు సోమవారం శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారు స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం హంస వాహనంపై పట్టణ పురవీధుల గుండా హరిహరులు విహరించనున్నారని అర్చకులు, ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ రాజన్న ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

தொடர்புடைய செய்தி