ధాన్యం కోనుగోలు కేంద్రాలలో సరైన వసతులు కల్పించాలి: కలెక్టర్

65பார்த்தது
ధాన్యం కోనుగోలు కేంద్రాలలో సరైన వసతులు కల్పించాలి: కలెక్టర్
ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలలో సరైన వసతులు కల్పించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామంలో ఏర్పాటు చేయుచున్న వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజు నుండి ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాలలో అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా అవసరమైన మేర టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி