సిరిసిల్ల జిల్లాలో సామాన్యులకు మరోసారి షాక్ తగిలిందని స్థానికులు తెలిపారు. నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. నూనె ధరలు లీటర్‌పై రూ. 20-45 వరకు, వెల్లుల్లి కిలో రూ. 300 నుంచి రూ. 360, అల్లం కిలో రూ. 100 నుంచి రూ. 150, ఎండుమిర్చి రూ. 200 నుంచి రూ. 240, పెసరపప్పు రూ. 150, మినపప్పు రూ. 135, కందిపప్పు రూ. 150 నుంచి 175కు పెరిగాయి. నిత్యావసరాల ధరలు పెరడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు.