పాలకుర్తి మండలంలోని అన్ని గ్రామాలలో ముఖ్యమైన పలు అభివృద్ధి పనులు చేపట్టాలని శనివారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్ గౌడ్ కేశోరాం సిమెంటు ఫ్యాక్టరీ ప్లాంట్ హెడ్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అలాగే దత్తత గ్రామాలలో సిఎస్ఆర్ నుండి చేయవలసిన పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుంగ నర్సయ్య, బొంపెల్లి సత్తయ్య, సంకెళ్ళ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.