పెద్దపల్లి: కాకా సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే

75பார்த்தது
పెద్దపల్లి: కాకా సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే
పేద ప్రజలకు కాకా వెంకటస్వామి చేసిన సేవలు మరువలేనివని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎంపీ వెంకటస్వామి జయంతిని పురస్కరించుకొని సుల్తానాబాద్ లో శనివారం కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, వైస్ చైర్ పర్సన్ బిరుదు సమతా కృష్ణ, పెద్దపల్లి మార్కెట్ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி