దసరా సెలవులను పురస్కరించుకొని ఊర్లకు వెళ్లే వారు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని ప్రజలు పోలీస్ శాఖ సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే పోలీస్టేషన్ లో సమాచారం ఇవ్వాలని, వివరాలు నమోదు చేసుకొని నిఘా ఏర్పాటు చేస్తామని, ప్రజలు సూచనలు పాటిస్తే చోరీల నియంత్రణ సులభమవుతుందని తెలిపారు.