రైతులు పండించిన సన్న రకం వడ్లకు రూ. 500 బోనస్ చెల్లిస్తామని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. శుక్రవారం ఓదెల మండలం కొలనూరు, కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రం, పెగడపల్లి గ్రామంలో సింగిల్ విండో, ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల అభ్యున్నతి కోసం పాటు పడుతున్నారన్నారు. రైతులకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదన్నారు.