గీత కార్మికుల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే

78பார்த்தது
గీత కార్మికుల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే
గీత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఓదెలలో సోమవారం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలోని తాటి వనంలో గౌడన్నలకు తాటిచెట్టు ఎక్కే కాటమయ్య రక్షణ కవచాలతో శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. ట్రైనర్ గౌడ సోదరులకు రక్షణ కవచంతో చెట్టు ఎక్కి వివరించారు. ఈకార్యక్రమంలోకాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, అన్నయ్య గౌడ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி