రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే అన్నారు. శనివారం రాత్రి సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఆవరణలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ జిల్లా స్థాయి టోర్నమెంట్స్ ముగిశాయి. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, వైస్ చైర్‌పర్సన్ బిరుదు సమత కృష్ణ పాల్గొన్నారు.