పెద్దపల్లి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని 19, 23 వార్డులో టీయు ఎఫ్ఐడిసి నిధులు రూ. 145. 50 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ లు, షెడ్, ప్రహారీ గోడ నిర్మాణాలకు శంఖుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.