రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఓదెల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, ఇచ్చిన మాట ప్రకారం రూ. 15 వేల పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గంట రాములు, నాయకులు పాల్గొన్నారు.