పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో గురువారం ఉదయం బీజేవైఎం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. హెచ్ సీయూ భూములలో ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా వెళ్తున్న ఓదెల బీజేవైఎం నాయకులను పోత్కపల్లి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులను బీజేవైఎం నాయకులు ఖండించారు.