ప్రకృతి స్వరూపిణిగా ప్రజలు ఆరాధించే బతుకమ్మ వేడుకల్లో రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు (గురువారం) ప్రకృతి స్వరూపిణి అయిన గౌరమ్మను ‘అటుకుల బతుకమ్మ’గా ఆరాధిస్తారని గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మహిళలు తెలిపారు. ప్రధానంగా నివేదించేవి అటుకులు కాబట్టి ‘అటుకుల బతుకమ్మ’ అని పిలుస్తారు. వివిధ రకాల పూలతో రెండు ఎత్తులలో గౌరమ్మను పేరుస్తారు.