ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామములో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమము మండల కన్వీనర్ దేశే ట్టి శ్రీనివాస్ ఆధ్యర్యంలో జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ఇంచార్జీ కరివేద మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వం ప్రతి ఇంటికి పోయి కార్యకర్తలు ఎక్కువ సభ్యత్వం నమోదు చేసి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అధిక స్థానాలలో విజయం సాధించాలని పిలుపు నిచ్చారు.