తిమ్మాపూర్లో గల ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో కంప్యూటర్ ట్యాలీపై ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ. సంపత్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పురుషులు 18 నుంచి 45 సం. ల వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ శిక్షణ 30 రోజులు ఉంటుందని బుధవారం ప్రకటన ద్వారా తెలిపారు.