తెలంగాణ ప్రాంతంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరోధించడంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ భజరంగ్ దళ్ కోరుట్ల శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10. 30 గంటలకు కార్గిల్ చౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందజేస్తామన్నారు. హిందువులందరం సంఘటితమై హైందవ సనాతన ధర్మాన్ని కాపాడుకుని, దేవాలయాలను పరిరక్షించుకుందామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భజరంగ్ దళ్ శాఖ వారు కోరారు.