కాంగ్రెస్ నాయకుడి హత్య కేసులో నిందితుడి అరెస్టు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు మారు గంగారెడ్డి(58) హత్య కేసులో నిందితుడు బత్తిని సంతోష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ లో ఈ నెల 22 న పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు ధర్యాప్తులో తేలిందన్నారు.