11 నెలల చిన్నారిపై వీధి కుక్క దాడి

67பார்த்தது
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లిలో మంగళవారం పదకొండు నెలల చిన్నారి అనుష్కపై వీధి కుక్క దాడి చేసింది. తీవ్ర గాయాలైన చిన్నారిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక ఇంటి ముందు అడుకుంటుండగా అటుగా వచ్చిన వీధి కుక్క దాడి చేసి కరిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా జిల్లాలో వీధి కుక్కల దాడి రోజురోజుకు పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

தொடர்புடைய செய்தி