జగిత్యాలలో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల రద్దీ కొనసాగుతుంది. దసరా పండగ సందర్భంగా మరింత రద్దీ పెరిగి బస్సు ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. మంగళవారం రాత్రి జగిత్యాల నుంచి దావనపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సు చివరి ట్రిప్పు కావటంతో దాదాపు 150 మందికిపై ప్రయాణికులు బస్సు ఎక్కగా బస్సులో ఊపిరాడక వృద్దులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.