జగిత్యాల జిల్లాలోని శ్రీనివాస్ పేరు గల వారంతా వాట్సాప్ గ్రూప్ పెట్టి అందులో అందరూ శ్రీనివాస్ లే చేరారు. ఒకే పేరుతో ఉన్న వ్యక్తులంతా ఆదివారం జగిత్యాల పట్టణంలోని వర్తక సంఘంలో కలిశారు. అక్కడి నుండి పాత మార్కెట్లోని వెంకటేశ్వర ఆలయం వరకు జై శ్రీనివాస్ జై జై శ్రీనివాస్, ఓం నమో వెంకటేశాయ అంటూ నినాదాలు చేస్తూ పాదయాత్రతో వెళ్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.