జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట ఎస్సీ కాలనీలో ఎండపల్లి రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పై ప్రతి పౌరుడు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పలువురు హితవు పలికారు. ఎంపీఓ గాజుల శ్రీనివాస్, ఎండపల్లి ఎంఈఓ గుండేటి రామచంద్రం, ఏఎంసీ వెల్గటూరు ఛైర్మన్ గుండేటి గోపిక జితేందర్ రెడ్డి, ఆర్ఐ తోడేటి అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.