గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను, వరద ప్రభావిత ప్రాంతాలను సోమవారం హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సందర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలైన 15, 17 వార్డులోని మామిండ్లవాడను, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి సందర్శించి, స్థానికులతో మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్, అధికారులతో మాట్లాడి వరద నివారణకు అవసరమయ్యే చర్యలు చేపట్టాలని కోరారు.