ఎండపల్లి మండలంలోని అంబారిపేటలో ఈ నెల 30వ తేదీన ఉదయం 11 గంటలకు పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ కడార్ల రవికాంత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని అదేవిధంగా షెడ్యూల్ కులములు, షెడ్యూల్ తెగల అంటరానితనం నిర్మూలణ, నివారణకై జరుగు గ్రామ సభకు అందరు హాజరు కావాలని తహసిల్దార్ విజ్ఞప్తి చేశారు.