మల్యాల మండలం కొండగట్టు పంచముఖ వద్ద ఫ్రీడం వంటనూనె లోడ్తో వెళ్తున్న డీసీఎం వ్యాన్ పట్టీ పడి చెట్టును ఢీకొని విషయం తెలిసిందే. ఈ ఘటనలో క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోగా మల్యాల పోలీసులు జగిత్యాల అగ్నిమాపక రెస్క్యూ సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీశారు.