బోయినిపల్లి మండలం స్థంభంపల్లి గ్రామ సమీపంలో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో వాహనదారులకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మండల సీపీఎం కన్వీనర్ గురజాల శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడారు. ప్రభుత్వాల అలసత్వం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు.