బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తడగొండ సెంటర్ లో టీబీ నివారణ పై శనివారం ఆరోగ్య సిబ్బందికి టిబి ఆలర్ట్ ఇండియా ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ జిల్లా అధికారి శ్రీనివాస్ అవగాహన కల్పించారు. టీబీ బారిన పడి ఆ వ్యాధిని జయించిన వారిని టీబీ ఛాంపియన్ గా గుర్తించి వారికి శిక్షణ నిర్వహించి వారి ద్వారా వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. డాక్టర్. రేణుక, సూపర్వైజర్స్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.