మెదక్ జిల్లా చేగుంటకు సీఆర్పీలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శనివారం వారి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ. ఎల్లారెడ్డి సమగ్రశిక్ష ఉద్యోగులు ఎమ్మార్సీ కార్యాలయం వద్ద వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, రూ. 20 లక్షల పరిహారం చెల్లించాలని ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ అశోక్, ఐఈఆర్పీ వెంకటేశం ప్రభుత్వాన్ని కోరారు.