నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని మండల సమైక్య భవనంలో శుక్రవారం ఐకేపీ, వీవోఏలకు గ్రామసంఘాల సభ్యులకు పిల్లల్లో పోషణ లోపం నివారించేందుకు తీసుకోవలసిన చర్యలపై రామనారాయణ గౌడ్, శ్రీనివాస్ శిక్షణ నిర్వహించారు. ఐదేళ్ల లోపు పిల్లల్లో పోషక లోపం పెరుగుతుందని, దీనివల్ల వారి శరీరక పెరుగుదల, మానసిక వికాసం బలహీన పడుతుంది, పిల్లల్లో పోషణ లోపాన్ని సాధారణ ఆరోగ్య పోషకాహార పద్ధతులను అనుసరించి పరిష్కరించవచ్చు అన్నారు.