నాగిరెడ్డిపేట మండలం తాండూర్ శివారులోని త్రిలింగేశ్వర ఆలయాన్ని శుక్రవారం మెదక్ పట్టణానికి చెందిన వనిత శక్తి గ్రూప్ సభ్యులు సందర్శించి ఒడి బియ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్వతిదేవి అమ్మవారికి ఒడిబియ్యం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రత్యేక అభిషేకాలు, దీపారాధన తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన దేవాలయం మెదక్ సమీపంలో ఉండడం గొప్ప విషయమన్నారు.