గురువారం వచ్చిందంటే చాలు ఎల్లారెడ్డి సాయిశివాలయం భక్తులతో కిటకిటలాడేది. ఈ మధ్యకాలంలో సాయిబాబాపై సామాజిక మాధ్యమంలో వస్తున్న ప్రచారంతో సాయి ఆలయంలో భక్తులు తగ్గిపోయారు. ఈ గురువారం మళ్ళీ ఒక్కసారిగా ఆలయంలో భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఉదయం నుండి మధ్యహ్నం వరకు ఆలయం భసక్తులతో కిటకిటలాడింది. స్థానిక వ్యాపారి పద్మశేఖర్ ఆలయంలో అన్నదాతగా నిలిచారు. భారీ సంఖ్యలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు.