ఎల్లారెడ్డితో పాటు మండలంలోని కళ్యాణి, రత్నపూర్, అజామాబాద్ తదితర గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం కురిసిన భారీవర్షానికి రైతులు కొనుగోలుకేంద్రాల వద్ద తీసుకు వచ్చిన వరిధాన్యం తడిసింది. 16 నుంచి సొసైటీల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటి ఛైర్మన్ లు, అధికారులు ప్రారంభించారు. రైతులు పండించిన వరి ధాన్యంను కొనుగోలు కేంద్రాలకు తెచ్చి కంటికి కునుకు లేకుండా కాపాల ఉంటున్నారు.