ఎల్లారెడ్డి మండలంలోని బిక్కనూర్ గ్రామంలో బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా టెంకాయ కొట్టి ఎమ్యెల్యే మదన్ మోహన్ మంజూరు చేసిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏర్పుల మహేందర్, సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, నారాయణ, శ్రీను, సృజన్ గౌడ్, సునీత, లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.