ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశానుసారం గాంధారి మండల కేంద్రంలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటాలకు కాంగ్రెస్ నేతలు పాలభిషేకం చేశారు. బీసీ కులగణన 42 శాతానికి పెంచినందున ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.