ఆడబిడ్డలకు ఏ కష్టం వచ్చినా ప్రజాప్రభుత్వంలో సత్వర న్యాయం జరుగుతుందని, వారి క్షేమమే మాకు ప్రధానమని ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె. మదన్ మోహన్ రావు అన్నారు. గురువారం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, లింగంపేట్ మండలాలకు సంబంధించిన 88 లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.