ఎల్లారెడ్డి పట్టణంలో బుధవారం హిందు సంఘాల బంద్ విజయవంతం కాగా, భారీ సంఖ్యలో హిందు సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు కాషాయ జెండాలు చేతబట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ జరిగింది. హిందు ఆలయాలను రక్షించాలని, ఆలయాలపై దాడులకు దిగిన వారిని చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చేసి, ఆలయాలపై దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని హిందు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.