నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం పోచంపాడ్ లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను ఆదివారం నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపాల్ సురేందర్, ఉపాద్యాయులు ఉన్నారు.