ఉపాధి హామీ కూలీలకు టెంట్లు ఏర్పాటు

550பார்த்தது
ఉపాధి హామీ కూలీలకు టెంట్లు ఏర్పాటు
ఉపాధి హామీ కూలీలకు ఎట్టకేలకు కనీస వసతులు అధికారులు కల్పించారు. 'లోకల్ యాప్' లో వచ్చిన ఉపాధి కూలీలకు కరువైన వసతులకు అధికారులు స్పందించారు. వెంటనే భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఉపాధిహామీ పనుల వద్ద టెంట్లతో పాటు మంచినీటి వసతి కల్పించారు. మండల అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పనుల వద్ద కూలీలకు కనీస వసతులు కల్పించాలని ఆదేశించడం జరిగిందన్నారు. నిర్లక్ష్యం పనికి రాదన్నారు.

தொடர்புடைய செய்தி