కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కండేయ మందిరంలో పద్మశాలి సంఘం కుల పెద్దల ఆధ్వర్యంలో సోమవారం రక్షాబంధన్ కార్యక్రమం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మొదటగా గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తూ జంజనం ధారణ చేసుకున్నాక, నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనమందరం దేశానికి రక్ష అంటూ ఒకరికొకరు రాఖీని కట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డివిజన్ పద్మశాలి సంఘం అధ్యక్షులు డాక్టర్. రాజు, తదితరులు పాల్గొన్నారు.