కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలో గల కెనరా బ్యాంక్ కు వెళ్లే దారిలో బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి వర్షపు నీరు నిలిచింది. దీంతో ప్రజలు బ్యాంకుకు వెళ్లడానికి, బ్యాంకు నుంచి బయటకు రావడానికి వర్షపు నీటిలో నుంచి వెళ్తూ అవస్థలు పడుతున్నారు.
బ్యాంకు ముందు వర్షపు నీటిని మురుగు కాలువల ద్వారా బయటకు తీయాలని బ్యాంకు వచ్చిన ప్రజలు కోరుతున్నారు.