అంగన్వాడి సెంటర్లో పోషక అభియాన్

451பார்த்தது
అంగన్వాడి సెంటర్లో పోషక అభియాన్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద మండల కేంద్రంలోని పెద్దదడిగి గ్రామంలో మంగళవారం అంగన్వాడి సెంటర్లలో జరిగిన పోషక అభియాన్ భాగంగా గర్భిణీ స్త్రీలకు సలహాలు ఇవ్వడం జరిగింది. ఎక్కువగా పోషకాహార పదార్థాలను మరియు ఆకు కూరగాయలు తీసుకోవాలని అన్నారు. గర్భణి స్త్రీలకు మరియు, చిన్నపిల్లలకు అంగన్వాడి టీచర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు అంగన్వాడికి సెంటర్ కు వచ్చి పోషణ పద్దర్థాలను, ఆకు కూరలు తీసుకోవాలని అలాగే చిన్న పిల్లలు రోజు అంగన్వాడికి స్కూల్ కు వచ్చేటట్టు చూడాలని అంగన్వాడీ టీచర్లు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సిహెచ్ సావిత్రి మరియు ఆయలు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி