కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలం కేంద్రంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో కాలనీల్లో వర్షపునీరు ప్రవహించడంతో జనం కొంత అసౌకర్యానికి లోనయ్యారు. అలాగే గ్రామ పరిధిలో సాగుచేసిన వివిధ రకాల పంటలు కూడా దెబ్బతిన్నాయి. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.