కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం గ్రామంలో మంగళవారం పిట్లం లైన్స్ క్లబ్ శాఖ ఆధ్వర్యంలో కంటి శిబిరం నిర్వహించినట్లు డాక్టర్ శ్రావణి తెలిపారు. ఈ కంటి శిబిరంలో 70 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 16 మందికి కంటి ఆపరేషన్ నిమిత్తం బాన్సువాడ లైన్స్ క్లబ్ ఆసుపత్రికి రెఫర్ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ లైన్స్ క్లబ్ జోనల్ కార్యదర్శి కిషన్ పాల్గొన్నారు.