పిట్లం మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం కామారెడ్డి జిల్లా మిషన్ భగీరథ ఆధ్వర్యంలో ఆయా గ్రామాలకు చెందిన గ్రామ మంచినీటి సహాయకులకు (వాటర్ మెన్ లకు) నాలుగు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఆఫీసర్లు గ్రామ మంచినీటి సహాయకులకు గ్రామంలోని త్రీ పేజీ మోటార్ల వద్ద, ఏ విధంగా వైరింగ్ చేసుకోవాలో, మోటార్ నడవకపోతే ఎలా చెక్ చేసుకోవాలో తదితర అంశాలపై వివరించారు. అనంతరం శిక్షణ తరగతులు ముగిసిన తర్వాత ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.