జుక్కల్ సెగ్మెంట్ కౌలాస్ నాలా ప్రాజెక్టులో జలాశయంలో ఆదివారం 235 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతొందని ప్రాజెక్టు ఏఈఈ. రవి తెలిపారు. ప్రాజెక్టు ప్రధాన కాల్వ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458. 00 అడుగులు కాగా, ప్రస్తుతం 457. 90 అడుగులు నీరు ప్రాజెక్టు జలాశయంలో ఉందన్నారు.