బాన్సువాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సర్వ సభ్య సమావేశం గురువారం మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో మూడు కోట్ల 10 లక్షల రూపాయలతో పనులు చేపట్టి, అమృత్ పథకం కింద మంజూరు 52 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీహరి రాజు, వైస్ చైర్మన్ జుబేర్, తదితరులు పాల్గొన్నారు.